Andhra Pradesh: కేశినేని నాని ట్వీట్ లో అచ్చుతప్పులు.. భాషా పరిజ్ఞానంతో చచ్చిపోతున్నామని పీవీపీ వెటకారం!

  • జగన్ సర్కారుపై కేశినేని విమర్శలు
  • కేశినేని కామెంట్లను తిప్పికొట్టిన పీవీపీ
  • ఇంటర్ లేదా డిగ్రీలో చేరాలని సెటైర్లు
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జగన్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడాలని టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు వివక్షాపూరితంగా, అన్యాయంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. తాజాగా కేశినేని వ్యాఖ్యలకు వైసీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కౌంటర్ ఇచ్చారు. కేశినేని భాషా పరిజ్ఞానంతో తామంతా చచ్చిపోతున్నామని ఎద్దేవా చేశారు.

వివక్షాపూరితంగా వ్యవహరించడం అనే పదాన్ని ఇంగ్లీష్ లో BIASED అంటారనీ, BAISED అని కాదని చురకలు అంటించారు. రోడ్డుపైకి ఎక్కి ఓ ఐపీఎస్ అధికారిపై రౌడీయిజం చేసినప్పుడు కేశినేనికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటివి గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. ఏదో భగత్ సింగ్ లాగా బిల్డప్ ఇవ్వవద్దని కేశినేనికి హితవు పలికారు.  ప్రజా సంక్షేమం దృష్ట్యా అమ్మఒడి పథకం కింద తాను రీయింబర్స్  మెంట్ చేయిస్తాననీ, ఇంటర్ లేదా డిగ్రీ పూర్తిచేయాలని పీవీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Andhra Pradesh
Telugudesam
Kesineni Nani
YSRCP
PVP
Twitter

More Telugu News