హారర్ థ్రిల్లర్ గా 'ఆవిరి' .. ఫస్టులుక్ రిలీజ్
- హారర్ థ్రిల్లర్ చిత్రాల దర్శకుడిగా రవిబాబు
- కొత్తవాళ్లతో రూపొందించిన 'ఆవిరి'
- టైటిల్ లో 'అ' అక్షరం ఆయన సెంటిమెంట్
ఈ హారర్ థ్రిల్లర్ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలాడు. గ్యాస్ స్టవ్ పై వున్న కుక్కర్ నుంచి ఆవిరి వస్తుండగా, కుక్కర్ పై భాగాన్ని ఓపెన్ చేసుకుని అందులో నుంచి భయపెడుతూ రెండు కళ్లు కనిపించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. 'ఆవిరి' అనే టైటిల్ కి తగినట్టుగా వదిలిన ఈ ఫస్టులుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. అంతా కొత్త వారితో రవిబాబు నిర్మించిన ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. గతంలో 'అవును' సినిమాతో విజయాన్ని అందుకున్న రవిబాబుకి, 'ఆవిరి' కూడా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.