Payal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గ్లామరస్ భామకు ప్రత్యేక ఆఫర్లు 
  • రాజమౌళి కోసం 'సైరా' స్పెషల్ షో 
  • 'ఆర్.ఆర్.ఆర్'పై విజయశాంతి వివరణ
*  'ఆర్ఎక్స్ 100' చిత్రంలో తన అందచందాలతో ఆకట్టుకున్న కథానాయిక పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు 'ఆర్డీఎక్స్ లవ్' చిత్రంతో వస్తోంది. ఇందులో కూడా తన బ్రాండ్ గ్లామర్ ను పాయల్ ప్రదర్శించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెతో గ్లామర్ ప్రధానంగా సాగే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి కొందరు నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారట. ఆ ప్రాజక్టుల పట్ల పాయల్ కూడా సానుకూలంగా వున్నట్టు తెలుస్తోంది.  
*  చిరంజీవి కథానాయకుడుగా నటించిన భారీ చిత్రం 'సైరా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో త్వరలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి కోసం ఈ చిత్రం ప్రత్యేక షోను ఏర్పాటు చేస్తున్నారట. రాజమౌళి నుంచి దర్శక నిర్మాతలు సలహాలు, సూచనలు తీసుకునే క్రమంలోనే ఈ షోను ముందుగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
*  దాదాపు పదమూడేళ్ల విరామం అనంతరం ప్రముఖ నటి విజయశాంతి మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ఇదే క్రమంలో రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని, ఈ చిత్రంలో తాను నటించడం లేదని విజయశాంతి తాజాగా వివరణ ఇచ్చారు.     
Payal
Chiranjivi
Saira
Rajamouli
Vijayashanti

More Telugu News