Nara Lokesh: తలలు పగిలి, చేతులు విరిగిన వాళ్లు మీకు పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారా?: హోంమంత్రిపై లోకేశ్ ఆగ్రహం

  • ట్విట్టర్ లో నిప్పులు చెరిగిన లోకేశ్
  • హోంమంత్రి మేకతోటి సుచరితపై విమర్శలు
  • బాధితులను అడిగితే వాస్తవాలు తెలుస్తాయంటూ హితవు
వైసీపీ దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత, ఇతర నేతలపై టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ గూండాల దాడిలో తల పగిలి 6 కుట్లు వేయించుకున్న వాళ్లు, చేతులు విరిగిన వాళ్లు మీకు పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుమించిన అహంభావం మరొకటి ఉండదని ట్వీట్ చేశారు.

 వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. లేకపోతే పాలన చేతకావడం లేదా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మైకుల ముందు అవాస్తవాలు మాట్లాడకుండా, ఈ బాధితుల ముందుకు వచ్చి అడిగితే అసలు నిజాలేంటో తెలుస్తాయని హితవు పలికారు. అయినా అంత ధైర్యం హోంమంత్రిగారు చేయగలరా? అంటూ సవాల్ విసిరారు.
Nara Lokesh
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News