Guntur District: గుంటూరులో టీడీపీ శిబిరం వద్దకు భారీగా పోలీసుల తరలింపు

  • పల్నాడు వైసీపీ బాధితుల కోసమంటూ టీడీపీ శిబిరం ఏర్పాటు
  • రేపు 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ప్రకటించిన టీడీపీ
  • పోటీగా వైసీపీ కూడా 'ఛలో ఆత్మకూరు' ప్రకటన
  • ముందు జాగ్రత్తగా గుంటూరు టీడీపీ శిబిరం వద్ద పోలీసుల మోహరింపు
పల్నాడులో తమ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ, కొన్నిరోజులుగా గుంటూరులో శిబిరం నిర్వహిస్తోంది. పల్నాడులోని కొందరు వైసీపీ దాడులు తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్లిపోతున్నారని, అలాంటి వారి పునరావాసం కోసమే తాము గుంటూరులో శిబిరం ఏర్పాటు చేసినట్టు టీడీపీ చెబుతోంది.

ఈ నేపథ్యంలో, గుంటూరులో టీడీపీ నిర్వహిస్తున్న పునరావాస శిబిరం వద్ద ఈ సాయంత్రం భారీగా పోలీసులు మోహరించారు. సుమారు 40 పోలీసు వాహనాలు శిబిరం వద్ద దర్శనమిస్తున్నాయి. రేపు టీడీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహిస్తుండడం, పోటీగా వైసీపీ కూడా ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను శిబిరం వద్దకు తరలించారు.
Guntur District
Telugudesam
Police

More Telugu News