Chinta Mohan: రాజధాని అమరావతే చంద్రబాబు ఓటమికి కారణం... జగన్ పరిస్థితీ అంతే!: మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యలు

  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత
  • అమరావతిలోని తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతం అంటూ వ్యాఖ్యలు
  •  అది దళితుల రక్తంతో తడిసిన ప్రాంతం 
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతమని అన్నారు. అది దళితుల రక్తంతో తడిసిన ప్రాంతమని తెలిపారు. చంద్రబాబు ఓటమికి రాజధాని అమరావతే కారణమని, రాజధానిగా అమరావతి ఉన్నంతవరకు జగన్ సక్సెస్ కాలేరని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మించే ప్రయత్నం చేయడం వల్లే చంద్రబాబు జారిపడ్డారని, జగన్ కు కూడా పెద్దగా కలిసిరాకపోవచ్చని వివరించారు. ఏపీ రాజధానిగా తిరుపతి అన్ని విధాలా సరైన ప్రాంతం అని స్పష్టం చేశారు.
Chinta Mohan
Congress
Chandrababu
Jagan
Telugudesam
YSRCP
Tirupati

More Telugu News