TTD: టీటీడీలో దళారీ వ్యవస్థ సమూల నిర్మూలన కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించాం: వైవీ సుబ్బారెడ్డి

  • పలువురు దళారీలను అరెస్ట్ చేసినట్టు వెల్లడి
  • ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు కోసం విజిలెన్స్ విభాగం బలోపేతం
  • సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత అన్న వైవీ
టీటీడీలో చాలాకాలంగా దళారులను వ్యవస్థ వేళ్లూనుకుపోయిందని, అక్రమాలకు ఆలవాలమైన ఆ వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు కార్యాచరణ రూపొందించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనేకమంది దళారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం రూపొందించిన ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సక్రమంగా అమలు చేయడం కోసం విజిలెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేశామని వైవీ వివరించారు. అంతేకాకుండా, తిరుమల క్షేత్రంలో సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. దర్శనం విషయంలో సామాన్యుడికే పెద్దపీట వేసే క్రమంలో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శన విధానాన్ని రద్దు చేశామని స్పష్టం చేశారు.
TTD
YV Subba Reddy
YSRCP
Tirumala
Tirupati

More Telugu News