'ప్రతిరోజూ పండగే' ప్రీ లుక్ రిలీజ్
- తేజు హీరోగా 'ప్రతిరోజూ పండగే'
- దర్శకుడిగా మారుతి
- సంగీత దర్శకుడిగా తమన్
ఫస్టులుక్ ను రేపు రాత్రి 8 గంటలకి విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్' భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ఈ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై సహజంగానే అందరిలో ఆసక్తి వుంది.