Kaveri: ఎన్నాళ్లకెన్నాళ్లకు... కావేరీ నది ఉగ్రరూపం... కరవుదీరా నీరు!

  • భారీ వర్షాలతో పెరిగిన వరద
  • కళకళలాడుతున్న ఆనకట్టలు
  • తమిళనాడుకు వస్తున్న నీరు
ఉత్తర కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కావేరీ నది ఉగ్రరూపం దాల్చింది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత వరద నదిలోకి వస్తుండటంతో, నదిపై ఉన్న అన్ని ఆనకట్టలూ కళకళలాడుతున్నాయి. ఇప్పటికే మేట్టూరు, కబినీ, ముక్కంపు, కల్లైన ప్రాజెక్టులు నిండుకుండలా మారగా, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా తమిళనాడుకు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వచ్చే వరద మరింతగా పెరగవచ్చన్న హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల యంత్రాంగం అప్రమత్తమైంది.

మొత్తం పది జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, నదీ పరీవాహక ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను అధికారులు ప్రారంభించారు. కాగా, దీర్ఘకాలంగా కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య తీవ్ర వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలతో ప్రస్తుతానికి ఆ అంశాన్ని రెండు రాష్ట్రాలూ పక్కనబెట్టినట్టేనని పరిశీలకులు అంటున్నారు.
Kaveri
River
Flood
Tamilnadu
Karnataka

More Telugu News