Bengalore: బెంగళూరులో బార్ లపై పోలీసుల దాడి.. రెస్క్యూ హోమ్స్ కి 100 మంది డ్యాన్సర్ల తరలింపు!

  • బార్లలో బలవంతంగా నృత్యాలు
  • మూడు బార్లపై పోలీసుల దాడి
  • పరారీలో ఉన్న యజమానులు
బెంగళూరులోని బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మాయిలతో సర్వ్ చేయిస్తూ, వారితో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు దాడులు చేసి, 100 మందికి పైగా యువతులను రెస్క్యూ హోమ్స్ కి తరలించి, 17 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

అశోకనగరలోని రెసిడెన్సీరోడ్డులో ఉన్న పేజ్ 3 బార్,  కబ్బన్‌పార్కు సమీపంలోని డయట్‌ బార్‌, టైమ్స్‌ బార్‌ పై దాడులు చేశామని, పట్టుబడిన అమ్మాయిలు డ్యాన్సర్లుగా, సప్లయర్లుగా ఉన్నారని, అక్కడి కస్టమర్లను పంపించి వేశామని, పరారీలో ఉన్న యజమానులు సంతోష్, రాజు, పాయల్, మహేశ్ తదితరుల కోసం గాలిస్తున్నామని డీసీపీ చేతన్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ బార్లలో ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన తెలిపారు.
Bengalore
Bar
Dancer
Police
Raids

More Telugu News