Donald Trump: వచ్చే ఎన్నికలకు ముందు ఆస్తులు ప్రకటిస్తా: ట్రంప్

  • ట్రంప్ ఆస్తులపై ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని ఆరోపణలు
  • వచ్చే ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు 
  • ఆస్తుల వివరాలు వెల్లడించి షాక్‌కు గురిచేస్తానన్న ట్రంప్
వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు తన ఆస్తుల వివరాలు వెల్లడించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తన ఆర్థిక నివేదికను వెల్లడించనున్నట్టు ఆయన తెలిపారు. తన కుటుంబ ఆస్తులపై ప్రభుత్వం అత్యధిక స్థాయిలో ఖర్చులు చేస్తోందన్న ఆరోపణలపై స్పందించిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐర్లండ్‌లో ఉన్న ట్రంప్ భవనంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బస చేయడంతో ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది నవంబరులో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే తన ఆస్తుల వివరాలు వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, తన ఆస్తులపై ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఎంత పన్ను కడుతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
Donald Trump
america
president of us

More Telugu News