Kadapa District: సౌదీలో గుండెపోటుతో కడప వాసి మృతి

  • జుబైల్‌లో భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్న పఠాన్
  • డ్యూటీకి వెళ్తుండగా గుండెపోటు
  • ఆసుపత్రికి తరలించేలోగా మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సత్తార్‌కాలనీ (కాగితాలపెంట)కి చెందిన పఠాన్ అంజాద్‌ఖాన్ సౌదీ అరేబియాలో మృతి చెందాడు. జీవనోపాధి కోసం సౌదీ వెళ్లిన అంజాద్‌ఖాన్ జుబైల్‌లో భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. శనివారం విధులకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న కడపలోని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పఠాన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
Kadapa District
saudi arebia
dead

More Telugu News