Chandrababu: రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనం: చంద్రబాబు

  • కర్నూలు జిల్లా హోసూరులో ఉద్రిక్తతలు
  • మహిళలపై లాఠీచార్జిని ఖండిస్తున్నట్టు తెలిపిన చంద్రబాబు
  • అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి
  • పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు
కర్నూలు జిల్లా హోసూరులో ఉద్రిక్తతలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మొహర్రం సందర్భంగా కర్నూలు ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. మహిళలపై లాఠీచార్జిని ఖండిస్తున్నట్టు తెలిపారు. మహిళలపై లాఠీచార్జి కారణంగా ప్రజలే తిరగబడి పోలీసుల వాహనాలు దగ్ధం చేసే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ముందస్తు అప్రమత్త చర్యలు చేపట్టాలని హితవు పలికారు.
Chandrababu
Andhra Pradesh
Kurnool District
Telugudesam
YSRCP

More Telugu News