Sharmishta: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ప్రణబ్ కుమార్తెకు బాధ్యతలు

  • శర్మిష్ట ముఖర్జీకి అధిష్ఠానం గుర్తింపు
  • ఢిల్లీ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న ప్రణబ్ తనయ
  • మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడికి కూడా 'జాతీయ' బాధ్యతలు
కాంగ్రెస్ పార్టీకి నూతన జాతీయ అధికార ప్రతినిధులను నియమించారు. కొత్త అధికార ప్రతినిధులుగా నియమితులైన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కూడా ఉన్నారు. శర్మిష్ట ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. శర్మిష్టతో పాటు లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కుమారుడు అన్షుల్ కుమార్ ను కూడా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.
Sharmishta
Pranab Mukherjee
Congress

More Telugu News