Tamilnadu: మెడకు చుట్టుకున్న పాముతో నడిచి వెళ్లిన పోలీసు అధికారి!

  • తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో విచిత్ర సంఘటన
  • రోడ్డు పక్కన చెట్టుకొమ్మకు చుట్టుకుని ఉన్న పాము
  • ఆ చెట్టు కింద ఉన్న ఇన్ స్పెక్టర్ మెడపైకి చేరిన వైనం
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు కొమ్మకు ఓ పాము తన తోకను చుట్టుకుని వేలాడుతోంది. ఇది గమనించిన వీరవనలూర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్యాంసన్, మెల్లగా అక్కడికి వెళ్లి ఆ పాము తోకను నేర్పుగా పట్టుకున్నాడు. ఆ వెంటనే అది అతని మెడ మీదుగా తలపైకి చేరింది.

అనంతరం పాముతో సహా కొంత దూరం అలాగే నడుచుకుంటూ వెళ్లి.. దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పాములు అంటే తనకు భయం లేదని, వాటిని పట్టుకోవడం తనకు చిన్నతనం నుంచే అలవాటని సదరు అధికారి చెప్పాడు.
Tamilnadu
Tirnalveli
Snake
Inspector

More Telugu News