Sudeep: మెగాస్టార్ తో కలిసి నటించిన ప్రతి నిమిషం జీవితాంతం గుర్తుండిపోతుంది: కన్నడ నటుడు సుదీప్

షార్ట్స్‌లో చూడండి
'ఈగ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుదీప్ చేరువయ్యాడు. కన్నడలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతోన్న ఆయన, తెలుగులో ముఖ్యమైన పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నాడు. ఆయన తాజా కన్నడ చిత్రం 'పహిల్వాన్' పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయనకి 'సైరా' సినిమా గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. 'సైరా'లో ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను గురించి ఆయన స్పందిస్తూ .. "చిరంజీవి వంటి గొప్ప నటుడు 'సైరా' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం చేయవలసిందే. ఈ సినిమాను చిరంజీవి తనయుడే నిర్మించడం మరో విశేషం. ఈ సినిమాలో నేను 'అవుకు రాజు' పాత్రను పోషించాను. ఇది చాలా మంచి పాత్ర .. అందువలన ఏ ఆర్టిస్ట్ చేసినా బాగానే ఉంటుంది. కానీ అవకాశం నాకు దక్కడం అదృష్టం. చిరంజీవి పక్కన నిలబడితే చాలని అనుకున్న నాకు, ఆయనతో కలిసి నటించే అవకాశం దొరికింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో కలిసి నటించిన ప్రతి నిమిషం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Sudeep

More Telugu News