Anantapur District: అనంతపురంలో ‘స్పందన’ కార్యక్రమంలో పాము కలకలం!

  • కలెక్టరేట్ లో నిర్వహించిన ‘స్పందన’
  • మంత్రి శంకర్ నారాయణకి ప్రజా సమస్యలపై వినతి
  • ప్రజలతో మంత్రి మాట్లాడుతున్న సమయంలో ‘పాము’ ఘటన
అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాము కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ కు ప్రజలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. అనంతరం, మంత్రితో ప్రజలు మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ నిలబడి ఉన్న ఓ వ్యక్తి కాళ్ల దగ్గరకు పాము వచ్చింది.

ఊహించని ఈ ఘటనతో సదరు వ్యక్తి సహా అక్కడే ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంత్రిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కాగా, పక్కనే ఉన్న పొదల్లోకి పాము వెళ్లిపోయింది.
Anantapur District
Minister
Shanker Narayan

More Telugu News