Tollywood: ప్రభాస్-పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ మూవీ.. యూరప్ లో షూటింగ్!

షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ పూజాహెగ్డే తన తర్వాతి ప్రాజెక్టు వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో తాను కొత్త సినిమాలో నటించబోతున్నట్లు పూజా హెగ్డే తెలిపింది. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను యూరప్ లో చేస్తారని చెప్పింది.

ఈ సినిమాకు సంబంధించిన స్ట్రిప్ట్ ను తాను చదివాననీ, ఇది అద్భుతమైన కథ అని వ్యాఖ్యానించింది.  ప్రభాస్ సరసన నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పూజా హెగ్డే ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Go Back to Shorts
Tollywood
Pooja hegde
Prabhas
Romantic movie
Europe shooting

More Telugu News