కోతుల దెబ్బ... పక్కకు ఒరిగిన మహానంది ప్రధాన గోపుర కలశాలు!
- కర్నూలు జిల్లాలో ఉన్న మహానంది
- అటవీ ప్రాంతం కావడంతో అధికమైన కోతుల బెడద
- త్వరలో నూతన కలశాల ప్రతిష్ఠాపన
నిన్న గోపురం కలశాలు ఒరగడాన్ని గమనించిన భక్తులు, విషయాన్ని దేవస్థానం దృష్టికి తీసుకు వెళ్లడంతో, ఓ ఉద్యోగిని పైకి ఎక్కించి కలశాలను తిరిగి నిలువుగా ఉంచారు. కొన్ని రోజుల తరువాత మంచి ముహూర్తం చూసుకుని, పీఠాధిపతుల సమక్షంలో ప్రధాన గోపురం సహా, మిగతా గోపురాలకు నూతన కలశాలను ప్రతిష్ఠింపజేస్తామని ఆలయ పండితులు వెల్లడించారు.