Karimnagar District: కరీంనగర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకురాలి దారుణహత్య

  • భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న మహిళ
  • కరీంనగర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ నిర్వహణ 
  • కత్తులతో దారుణంగా నరికి చంపిన దుండగులు
భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన అమల భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటోంది. గత కొన్నాళ్లుగా కరీంనగర్‌లో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఆదివారం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అన్న విషయాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karimnagar District
Siddipet District
woman
murder

More Telugu News