Congress: మోదీ వందరోజుల పాలనపై రాహుల్ సెటైర్లు

  • ఎలాంటి ప్రగతి లేకుండా వంద రోజుల పాలన సాగింది
  • ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు
  • మీడియా గొంతు నొక్కుతున్నారు: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విమర్శలు గుప్పించారు. ఎలాంటి ప్రగతి లేకుండా వంద రోజుల పాలన సాగించిన మోదీ సర్కార్ కు అభినందనలు తెలియజేస్తున్నాననంటూ రాహుల్ సెటైర్లు విసిరారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతూ, మీడియా గొంతు నొక్కుతూ పాలన కొనసాగుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షతో దర్యాప్తులు వంటివి చేస్తోందని విమర్శించారు.

రాజకీయ అనిశ్చితి కారణంగా పలు సమస్యలు ఏర్పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని అన్నారు. ప్రియాంక గాంధీ స్పందిస్తూ, మోదీ వందరోజుల పాలనతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి అబద్ధాలు చెబుతూ, నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
Congress
Rahul Gandhi
Bjp
Modi
PM

More Telugu News