Andhra Pradesh: రామ్ జెఠ్మలాని ఆకస్మిక మరణం.. స్పందించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్!

  • జెఠ్మలాని మరణం దేశానికి తీరని లోటు
  • ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారు
  • జెఠ్మలాని కేసు టేకప్ చేస్తే గెలిచేసినట్లే
ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలాని(95) ఈ రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జెఠ్మలానీ ఈరోజు ఉదయం 7.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రామ్ జెఠ్మలాని మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఆయన మరణంపై సంతాపం తెలిపిన పవన్.. జెఠ్మలాని మరణం దేశానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జెఠ్మలాని తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారని పవన్ ప్రశంసించారు. న్యాయవాదిగా జెఠ్మలాని పేరు సుపరిచితమనీ, ఆయన కేసును టేకప్ చేశారంటే ఇక గెలిచేసినట్లే అని న్యాయ నిపుణులు చెబుతుంటారని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు రామ్ జెఠ్మలానికి నివాళులు అర్పించారు.
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
Condolenses
RAm jethmalani
Death

More Telugu News