Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే ఫొటో ఎగ్జిబిషన్ పెడతాం!: యనమల రామకృష్ణుడు

  • ప్రభుత్వ నేరాలు, ఘోరాలను ప్రజల ముందు ఉంచుతాం
  • మేం విడుదల చేసిన కరపత్రంలో అన్నీ వాస్తవాలే
  • 8 మండలాల్లో నాణ్యతలేని బియ్యం సరఫరా
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలను ప్రజల ముందు ఉంచుతామని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 100 రోజుల వైసీపీ పాలనపై తాము విడుదల చేసిన కరపత్రంలో అన్నీ వాస్తవాలేనని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై  త్వరలోనే ఫొటో ఎగ్జిబిషన్ కూడా పెడతామని యనమల వెల్లడించారు.

అలాగే ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకంపై కూడా యనమల విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిన్న పంపిణీ చేసిన సన్నబియ్యం మరో రుజువని టీడీపీ నేత వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో నిన్న 8 మండలాల్లో నాణ్యతలేని బియ్యాన్ని సరఫరా చేశారని పేర్కొన్నారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Telugudesam
Yanamala

More Telugu News