West Godavari District: గ్రామస్థురాలు తిట్టిందని వలంటీర్ ఆత్మహత్య

షార్ట్స్‌లో చూడండి
గ్రామస్థురాలు తిట్టిందని వలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో జరిగింది. తన ఆధార్‌కార్డులో ఇంటి పేరు మార్చాలంటూ గ్రామానికి చెందిన మంగ.. వలంటీర్ నవీన(23)ను కోరింది. అయితే, ఆధార్ కార్డులో సవరణలు తన పరిధిలోకి రావని చెప్పినా ఆమె వినిపించుకోకుండా వాగ్వివాదానికి దిగింది. ఆపై పరుష పదజాలాన్ని ఉపయోగించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన శనివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో సూసైడ్ నోట్ దొరికినట్టు నవీన తండ్రి శ్రీరామ్మూర్తి తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Go Back to Shorts
West Godavari District
volunteer
suicide

More Telugu News