Amaravathi: అమరావతిని ఘోస్ట్ సిటీలా మార్చేశారు: ఏపీ సర్కారుపై సుజనా చౌదరి ధ్వజం

  • ఏపీ సర్కారుపై సుజనా విమర్శలు
  • అమరావతిలో అవినీతి ఎందుకు నిరూపించలేకపోయారంటూ ప్రశ్నించిన సుజనా
  • ఉన్న పోర్టులు రద్దు చేస్తుంటే కొత్త పోర్టులు ఎలా వస్తాయంటూ వ్యాఖ్యలు
ఏపీ సర్కారుపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ధ్వజమెత్తారు. అమరావతిని ఘోస్ట్ సిటీ (దెయ్యాల నగరం)గా మార్చేశారంటూ మండిపడ్డారు. అమరావతిలో అవినీతి అన్నారు, కానీ ఎందుకు నిరూపించలేకపోయారు అంటూ నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును అర్థాంతరంగా నిలిపివేశారని అసహనం వ్యక్తం చేశారు. ఉన్న పోర్టులు రద్దు చేస్తుంటే కొత్త పోర్టులు ఎలా వస్తాయో చెప్పాలని ప్రశ్నించారు. పరిశ్రమల్లో అన్ని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటే రాజ్యాంగం ప్రకారం సాధ్యంకాదని స్పష్టం చేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని భీష్మించుకుని కూచుంటే ఉన్న పరిశ్రమలు కూడా తరలివెళ్లే పరిస్థితి నెలకొంటుందని సుజనా హెచ్చరించారు.
Amaravathi
Sujana Chowdary
Andhra Pradesh
Jagan

More Telugu News