KCR: చేసిన తప్పుకు కేసీఆర్ పొర్లు దండాలు పెట్టాలి: బీజేపీ ఎంపీ బండి సంజయ్

  • యాదాద్రి స్తంభాలపై కేసీఆర్ బొమ్మను చెక్కడం దారుణం
  • హిందూ సమాజం పట్ల కేసీఆర్ కి చులకన భావం ఉంది
  • యాదాద్రి కేంద్రంగా రాజకీయ ప్రచారం చేసుకోవడం దారుణం
పవిత్రమైన యాదాద్రి ఆలయంలోని స్తంభాలపై కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తులను చెక్కడం దారుణమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పుకు యాదాద్రిలో కేసీఆర్ పొర్లు దండాలు పెట్టాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజం పట్ల కేసీఆర్ కి చులకన భావం ఉందని చెప్పారు. యాదాద్రి కేంద్రంగా రాజకీయ ప్రచారం చేసుకోవడం దారుణమని అన్నారు. హిందూ దేవాలయాన్ని కేసీఆర్ అపవిత్రం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కరీంనగర్ సభలో హిందుగాళ్లు, బొందుగాళ్లు అని కేసీఆర్ అన్నారని... అందుకే ఆ పార్టీకి ఎన్నికల్లో గుణపాఠం నేర్పారని చెప్పారు.
KCR
TRS
Yadadri
Bandi Sanjay
BJP

More Telugu News