Andhra Pradesh: టీడీపీ కార్యకర్త హరిబాబుకు బెదిరింపులు.. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు!

  • ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందనిపిస్తోంది 
  • ఇలా బెదిరిస్తున్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా బెదిరిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్త హరిబాబు తనను వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారని పెట్టిన సందేశాన్ని చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వైసీపీ శ్రేణుల దుర్మార్గం చూస్తుంటే  రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల పేరిట ఓ రౌడీ రాజ్యమే నడుస్తుందా? అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

ఇలా టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులను బెదిరిస్తున్న వాళ్లపై ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వైసీపీ 100 రోజుల పాలనలో టీడీపీ మద్దతుదారులను ఎలా బెదిరిస్తున్నారో చెప్పడానికి హరిబాబు ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు.
Andhra Pradesh
Telugudesam
Haribabu
Threat
Chandrababu
Twitter
warning
YSRCP

More Telugu News