వెంటనే ఐఏఎస్ అధికారుల్ని రంగంలోకి దించండి!: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్
- కేంద్రం, రాష్ట్రం వైఫల్యం వల్లే యూరియా కొరత
- ఐఏఎస్ లను స్పెషల్ ఇన్ చార్జీలుగా నియమించండి
- ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ లోపం కారణంగానే తెలంగాణలో యూరియా కొరత తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రతీ జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఇన్ చార్జీగా నియమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.