Pakistan: సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాక్ సైనికులు

  • పూంచ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డ పాక్ సైన్యం
  • సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత సైన్యం
  • తోక ముడిచిన పాక్ సైనికులు
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచేందుకు పాకిస్థాన్ యత్నిస్తోంది. ఈ ఉదయం జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న పూంచ్ జిల్లా కృష్ణ ఘరి సెక్టార్ లో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, మన సైనికులు వారి దాడులను సమర్థంగా తిప్పికొట్టారు. మన సైనికులు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడంతో పాక్ సైనికులు తోక ముడిచారు. మరోవైపు, భారత భూభాగంలోకి ఉగ్రవాదులను జొప్పించేందుకు పాక్ సైన్యం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, సరిహద్దుల్లో భారత బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి.
Pakistan
India
Boarder
Firing

More Telugu News