Andhra Pradesh: వాలంటీర్లకు ఏం తక్కువ.. అజ్ఞాని, అప్రయోజకుడైన మాలోకానికే పెళ్లయిందిగా!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • వాలంటీర్లకు పిల్లనివ్వరని బాబు అంటున్నారు
  • లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించారు
  • అలాంటి వాలంటీర్లకు ఏం తక్కువ?
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నెలకు రూ.5 వేల వేతనం అందుకునే గ్రామ వాలంటీర్లకు వివాహానికి పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎకసెక్కాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అప్రయోజకుడు, అజ్ఞాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
Chandrababu
Nara Lokesh
Villege volunteers
counter

More Telugu News