godavari-krishna link: గోదావరి జలాల తరలింపు పథకంపై చర్చించేందుకు 11న కీలక భేటీ

  • శ్రీశైలం నదిలోకి నీటి తరలింపునకు తెలుగు రాష్ట్రాల యోచన
  • దీనిపై చర్చించేందుకు మరోసారి భేటీకానున్న జలవనరుల శాఖ
  • హైదరాబాద్‌లో జరగనున్న సమావేశం
గోదావరి నదిలోని మిగులు జలాలను కృష్ణా నదిలోకి మళ్లించి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలన్న తెలుగు రాష్ట్రాల బృహత్తర ప్రణాళికలో భాగంగా అనుసంధాన పథకంపై చర్చించేందుకు ఈనెల 11న జల వనరుల శాఖ నిపుణులు సమావేశమవుతున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల జవనరుల శాఖ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, అంతర్రాష్ట్ర జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహారావు, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
godavari-krishna link
meet on 11
Hyderabad

More Telugu News