12న హైదరాబాదు గణేశ్ శోభాయాత్ర.. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
- బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్ర ప్రారంభం
- యాత్రలో పాల్గొననున్న స్వామి ప్రజ్ఞానంద
- యాత్రలో 40 లక్షల మంది పాల్గొనే అవకాశం
శోభాయాత్రలో డీజేలు, సినిమా పాటలు, అసభ్య డాన్సులు చేయవద్దని, దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలని ఉత్సవ సమితి సూచించింది. ప్రతీ ఏడాది ఓ థీమ్ పెట్టుకుంటున్నట్టుగానే ఈసారి జలియన్ వాలాబాగ్లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. వదంతులను నమ్మొద్దని సూచించారు. శోభాయాత్రను తిలకించేందుకు 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.