Uttar Pradesh: కారులో వెళ్తూ హెల్మెట్ ధరించలేదట.. వ్యాపారికి రూ.500 చలానా పంపిన ట్రాఫిక్ పోలీసులు

  • ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘటన
  • చలానా చూసి విస్తుపోయిన వ్యాపారి
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు
కారులో వెళ్తూ హెల్మెట్ ధరించలేదని ఓ వ్యక్తికి రూ.500 చలానా జారీచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. నగరానికి చెందిన వ్యాపారి అనీశ్ నరూలా కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదంటూ ట్రాఫిక్ పోలీసులు ఆయనకు రూ.500 చలానా పంపారు. ఇది చూసి విస్తుపోయిన ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు పొరపాటు జరిగిందని, చలానా జారీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.
Uttar Pradesh
raebareli
Helmet

More Telugu News