Visakhapatnam District: విశాఖలో దారుణం.. ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం

  • పక్కింట్లో నివసించే బాలికపై బాలుడి అత్యాచారం
  • ఈ నెల 4న ఘటన
  • పోలీసుల అదుపులో నిందితుడు
విశాఖపట్టణం పరిధిలోని ప్రహ్లాదపురంలో దారుణం జరిగింది. పక్కింట్లో నివసించే ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ నెల నాలుగో తేదీన ట్యూషన్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు.

అయినప్పటికీ ఆచూకీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పక్కింట్లో వెతికారు. ఆ సమయంలో బాలుడు, బాలిక ఇద్దరే అక్కడ ఉన్నారు. దీంతో బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు.
Visakhapatnam District
girl
boy
rape

More Telugu News