Nara Lokesh: "వైసీపీ మృగాలు" అంటూ విమర్శల్లో తీవ్రత పెంచిన నారా లోకేశ్

  • పుట్టపర్తి నియోజకవర్గంలో తమ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారంటూ లోకేశ్ ఆరోపణ
  • క్షతగాత్రుల ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన వైనం
  • ఫలితం అనుభవిస్తారంటూ సీఎం జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్
తమ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాక్షసంగా దాడులు చేస్తున్నారంటూ టీడీపీ అధినాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా నారా లోకేశ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. పుట్టపర్తి నియోజకవర్గం మైలసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారంటూ మండిపడ్డారు. కనీసం మహిళలు, వృద్ధులు అన్న కనికరం లేకుండా గాయపరిచారంటూ క్షతగాత్రుల ఫొటోలను ట్వీట్ చేశారు.

జగన్ గారూ, మీరు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ మృగాలు తమ 500వ దాడిని మీకు అంకితం చేశాయి అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా ఏపీ పచ్చగా కళకళలాడిందని, ఇవాళ జగన్ తుగ్లక్ పాలనలో నెత్తురోడుతోందని విమర్శించారు. "వైసీపీ రాక్షసులకు టీడీపీ కార్యకర్తల రక్తం చూడందే నిద్రపట్టడం లేదనుకుంటా, ఇకనైనా ఈ మారణహోమం నిలిపివేయండి, లేకపోతే ఫలితం అనుభవిస్తారు" అంటూ గట్టిగా హెచ్చరించారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News