Bigg Boss-3: బిగ్ బాస్ హౌస్ లో పురివిప్పిన భావోద్వేగాలు!

షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్ రియాల్టీ షో అంటే భావోద్వేగాలకు నెలవు అని చెప్పాలి. కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు దూరంగా ఉండాల్సి రావడం వారిని ఓ ప్రత్యేకమైన స్థితికి చేర్చుతుంది. దాంతో, తమ వారి ప్రస్తావన రాగానే హౌస్ మేట్లలో ఎమోషన్స్ ఉప్పొంగుతాయి. తాజాగా, బిగ్ బాస్-3 హౌస్ లో కూడా అలాంటి వాతావరణమే ఏర్పడింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి సందేశాలు వచ్చాయి. తమవారు పంపించిన లేఖలు చూసుకుని హౌస్ మేట్స్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. శివజ్యోతి, రవికృష్ణ, వితిక, బాబా భాస్కర్ తదితరులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్ కు బిగ్ బాస్ కాస్తంత ఎమోషనల్ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు.
Go Back to Shorts
Bigg Boss-3
Andhra Pradesh
Telangana

More Telugu News