Nayanatara: విఘ్నేశ్ శివన్ నిర్మాతగా నయనతార థ్రిల్లర్ మూవీ

  • 'గృహం' దర్శకుడితో నయనతార 
  • మరో థ్రిల్లర్ మూవీకి సన్నాహాలు 
  • త్వరలోనే పట్టాలపైకి        
ఒక వైపున అగ్రకథానాయకుల సరసన ప్రాధాన్యత కలిగిన భారీ చిత్రాలను చేస్తూనే, మరో వైపున లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ నయనతార తన ప్రత్యేకతను చాటుకుంటోంది. నాయిక ప్రాధాన్యత కలిగిన హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు చాలా వరకూ విజయవంతమై ఆమె క్రేజ్ ను మరింతగా పెంచాయి. ఆ తరహా సినిమాలకి ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.

మరోసారి ఆమె ఒక థ్రిల్లర్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాకి నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మాతగా వ్యవహరించనుండగా, 'గృహం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మిలింద్ రావ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ల్యుక్ కెన్నీ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ థ్రిల్లర్ మూవీలో ఒక కుక్క కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేస్తారు. 
Nayanatara
vighnesh Shivan

More Telugu News