Pawan Kalyan: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్... జనసేనానిని చూడడం కోసం పోటెత్తిన అభిమానులు!

  • అంతర్వేది విచ్చేసిన పవన్ కల్యాణ్
  • పవన్ ఫ్యాన్స్ తో కిటకిటలాడిన అంతర్వేది క్షేత్రం
  • అందరికీ అభివాదం చేసి ముందుకు కదిలిన పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జనసేనానికి దేవాలయ వర్గాలు ఘనస్వాగతం పలికాయి. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక, పవన్ రాకతో అంతర్వేది పుణ్యక్షేత్రం జనసంద్రాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు. తమ ఆరాధ్య దైవాన్ని చూసేందుకు వీరాభిమానులు ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తారు. ఆలయానికి దారితీసే ప్రధాన వీధులన్నీ క్రిక్కిరిసిపోయాయి. పవన్ కల్యాణ్ తన అభిమానులకు, జనసైనికులకు కారులోంచే అభివాదం చేశాడు.
Pawan Kalyan
Anatarwedi
East Godavari District

More Telugu News