TG Venkatesh: హామీలు నెరవేర్చేందుకు జగన్ కృషి చేస్తున్నారు: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్

  • రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అమరావతికి ఉన్నాయి
  • కేంద్ర నిధులతో పోలవరంను త్వరగా పూర్తి చేయాలి
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్రశంసలు కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జగన్ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అమరావతికి ఉన్నాయని చెప్పారు. ఏపీలోని నాలుగు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసిన తర్వాతే అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని... కేంద్రం నిధులతో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు.
TG Venkatesh
jagan
YSRCP
BJP
Polavaram

More Telugu News