RGV: 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్... చంద్రబాబు లుక్ ఇదేనా...?

  • మరోసారి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా తెరకెక్కిస్తున్న వర్మ
  • రేపు ఉదయం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మోషన్ పోస్టర్ రిలీజ్
  • షూటింగ్ శరవేగంతో సాగుతోందంటూ ట్వీట్ చేసిన వర్మ
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల ఆధారంగా వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ను వర్మ ట్వీట్ చేశారు. సెప్టెంబరు 7వ తేదీ ఉదయం 9.27 గంటలకు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా షూటింగ్ శరవేగంతో సాగుతోందంటూ వెల్లడించారు. దాంతోపాటే, ఈ సినిమాలో చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఓ పిక్ ను కూడా జోడించినట్టు అర్థమవుతోంది.
RGV
KRKR
Chandrababu

More Telugu News