Kishan Reddy: లోపం మీలో పెట్టుకుని.. మాపై ఆరోపణలా?: కేసీఆర్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

  • యూరియా అంశంపై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది
  • టీఎస్ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడమే సమస్యకు కారణం
  • రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. యూరియా అంశంపై కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేనందువల్లే యూరియా సమస్య తలెత్తిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే కేంద్రం 50 శాతం యూరియాను తెలంగాణకు పంపిందని చెప్పారు. మరో 50 శాతం యూరియా రెండు రోజుల్లో చేరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక ఉంటే ఈ సమస్య ఉత్పన్నమై ఉండేది కాదని అన్నారు. రాష్ట్రం అడిగిన వెంటనే కేంద్రం యూరియాను పంపుతోందని చెప్పారు. రైతులు ఎవరూ యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
Kishan Reddy
BJP
TRS
Uria

More Telugu News