Andhra Pradesh: కారు నిండా గంజాయే.. గుంటూరులో ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా మాదకద్రవ్యాలకు హబ్ గా మారుతోంది. తాజాగా విశాఖ నుంచి తరలిస్తున్న 200 కేజీల గంజాయిని ఈరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి ఓ కారు గంజాయి లోడుతో వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గుంటూరు కాజా టోల్ గేట్ వద్ద కాపు కాశారు. ఈ సందర్భంగా ఓ కారును పరిశీలించిన పోలీసులు అందులో అనుమానాస్పదంగా ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను తనిఖీ చేశారు.

దీంతో వాటిలో గంజాయిని తరలిస్తున్నట్లు బయటయపడింది. దీంతో కారులోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గంజాయిని విశాఖపట్నం నుంచి తమిళనాడులోని మధురైకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత మూడు నెలల్లో ఈ మార్గంలో మూడు సార్లు గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. గత నెలలోనే ఓ వాహనంలో తరలిస్తున్న 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Guntur District
Police
Toll gate
Checkings
200 kg
WEED
ganja
Cannabis
Visakhapatnam District
Tamilnadu
car

More Telugu News