Chidambaram: అల్పాహారంతో జైలు జీవితాన్ని ప్రారంభించిన చిదంబరం

  • నిన్న రాత్రి తీహార్ జైలుకు చిదంబరం తరలింపు
  • ప్రత్యేక సదుపాయాలను కల్పించని అధికారులు
  • నిన్న రాత్రి రోటీ, దాల్, సబ్జీలను స్వీకరించిన చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను నిన్న రాత్రి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. నిన్న రాత్రి అల్పాహారంతో ఆయన తన జైలు జీవితాన్ని ప్రారంభించారు. జైల్లో చిదంబరంకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. ఒక ప్రత్యేకమైన సెల్ తో పాటు, వెస్టర్న్ టాయిలెట్ ను ఆయనకు కేటాయించారు. జైల్లో ఉన్న ఖైదీలతో పాటు నిర్దేశిత సమయంలో లైబ్రరీలో పుస్తకాలు చదవడం, టీవీని వీక్షించడం చేయవచ్చు.

నిన్న రాత్రి రోటీ, దాల్, సబ్జీలను చిదంబరం స్వీకరించారు. మెడికల్ చెకప్ తర్వాత ఆయనను జైల్ నెంబర్ 7లో ఉంచారు. ఈ జైల్లో ఈడీ కేసుల్లో నిందితులను ఉంచుతారు. చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఇదే సెల్ లో 12 రోజుల పాటు గడపడం గమనార్హం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించిన సంగతి తెలిసిందే.
Chidambaram
Jail
Tihar
Congress

More Telugu News