Anna Canteen: చదరపు అడుగుకు రూ 4,500 ఖర్చవుతుందా చంద్రబాబు గారూ?: విజయసాయిరెడ్డి

  • పేదలకు పెట్టిన అన్నం ముద్దలో కూడా తండ్రీకొడుకులు కమిషన్లు తిన్నారు
  • అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ. 53 కోట్ల అవినీతి చోటుచేసుకుంది
  • వాటాలు మాట్లాడుకుని... టెండర్లు ఇచ్చారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. పేదలకు పెట్టిన అన్నం ముద్దలో కూడా తండ్రి (చంద్రబాబు), కొడుకు (లోకేశ్) కమిషన్లు తిన్నారని ఆరోపించారు. 203 అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ. 53 కోట్ల అవినీతి చోటు చేసుకుందనే విషయం విచారణలో తేలిందని చెప్పారు.

 రెండు కాంట్రాక్టు సంస్థలతో వాటాలు మాట్లాడుకుని... వాటికే పనులు దక్కేలా టెండర్లను రూపొందించారని విమర్శించారు. ఒక చదరపు అడుగుకు రూ. 4,500 ఖర్చు అవుతుందా చంద్రబాబు గారూ, లోకేశ్? అని ప్రశ్నించారు. మరో వైపు విజయసాయిరెడ్డి ట్వీట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. విచారణ జరిపిన వాళ్లు ఎవరు సార్? అని ప్రశ్నిస్తున్నారు. సొల్లు మాటలు వద్దు... ప్రభుత్వం మీదేగా, దమ్ముంటే అరెస్ట్ చేయండి, మీకు మేము అండగా ఉంటామని ట్వీట్లు చేస్తున్నారు.
Anna Canteen
Chandrababu
Nara Lokesh
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News