Visakhapatnam District: విశాఖపట్టణం విమానాశ్రయ డైరెక్టర్‌గా రాజకిశోర్

  • రాజమండ్రి నుంచి పదోన్నతిపై విశాఖకు
  • రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధిలో కీలక పాత్ర
  • విమానయాన రంగంలో 26 ఏళ్ల అనుభవం
విశాఖపట్టణం విమానాశ్రయ డైరెక్టర్‌గా ఎం.రాజకిశోర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. విమానయాన రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉన్న రాజకిశోర్ రాజమండ్రి నుంచి పదోన్నతిపై విశాఖ బదిలీ అయ్యారు. చెన్నై విమానాశ్రయంలోని ఏటీసీ విభాగంలో 9 సంవత్సరాలు, హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్నేళ్లు, ఆంధ్ర్రప్రదేశ్ విభజన తర్వాత విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్‌గా మరికొన్నేళ్లు పనిచేసిన అనుభవం ఆయన సొంతం.

రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధిలో రాజకిశోర్ కీలక పాత్ర పోషించారు. రన్‌వే విస్తరణ, కార్గో టెర్మినల్ నిర్మాణ పనులు పూర్తిచేయడంతోపాటు ప్రయాణికుల సంఖ్యను 1.25 లక్షల నుంచి 4.47 లక్షలకు పెంచారు. అలాగే ఆరు విమాన సర్వీసులను 22కు పెంచారు.
Visakhapatnam District
airport
M.Rajakishore

More Telugu News