Jagan: వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి.. సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

  • అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ 
  • తనకు బదులుగా తన న్యాయవాది హాజరువుతారంటూ వివరణ
  • శుక్రవారం విచారణకు రానున్న పిటిషన్
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సీబీఐ కోర్టుకు విన్నవించారు. తనకు బదులుగా తన న్యాయవాది విచారణకు హాజరవుతారని తెలిపారు. ఏపీకి సీఎంగా ఉన్నందున పాలనా వ్యవహారాలు చూసుకోవాల్సి ఉందని, అందుకు వీలుగా తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ మేరకు నాంపల్లి సీబీఐ న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
Jagan
Andhra Pradesh
CBI

More Telugu News