Gadwal: రహదారులు వరిమళ్లు అయిపోయాయి!: డీకే అరుణ

  • రోడ్లన్నీ వరిమళ్లు ఉన్నట్టు ఉన్నాయి
  • అందుకే, వరి నాట్లు వేశాం
  • ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి
గద్వాల్ లోని రోడ్ల దుస్థితిపై బీజేపీ నేత డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలు పడి వర్షపు నీటితో నిండిన రోడ్లపై వరినాట్లు వేసి తమ నిరసన తెలిపారు. ‘కేసీఆర్ డౌన్ డౌన్.. ఇదేమి రాజ్యం..’ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, రోడ్లన్నీ వరిమళ్లు ఉన్నట్టు ఉన్నాయని, అందుకే, వరి నాట్లు వేశామని ఎద్దేవా చేశారు. రహదారులు వరిమళ్లు అయిపోయాయని, ఇలాంటి వాటిపై ప్రజలు నడవాలన్నా, వాహనాలు తిరగాలన్నా కష్టమేనని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు.
Gadwal
Bjp
Dk Aruna
Roads
cm
kcr

More Telugu News