Thota Narasimham: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు: తోట నరసింహం

  • తోట నరసింహం పార్టీ మారుతున్నట్టు ప్రచారం
  • జగన్ ఆదేశాల మేరకు పని చేస్తానన్న తోట
  • ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వ్యాఖ్య
వైసీపీ నేత, మాజీ ఎంపీ తోట నరసింహం పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా అసత్య ప్రచారమేనని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తమ కుటుంబం నడుచుకుంటుందని చెప్పారు. తమ అధినేత జగన్ ఆదేశాల మేరకు తాను పని చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని... ఇకపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు.
Thota Narasimham
YSRCP
Jagan

More Telugu News