Chinthamaneni Prabhakar: టీడీపీ నేత చింతమనేని కోసం గాలిస్తున్న పోలీసు ప్రత్యేక బృందాలు

  • చింతమనేనిపై 50 కేసులు నమోదయ్యాయన్న జిల్లా ఎస్పీ
  • అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదు
  • చట్ట ప్రకారం కేసులను దర్యాప్తు చేస్తున్నాం
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. చింతమనేనిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. ఇద్దరు ఏఎస్ఐలపై దురుసుగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయని... ఇతరుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయని తెలిపారు. చట్ట ప్రకారం కేసులను దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చింతమనేనిపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం జరగడంపై శాఖాపరమైన విచారణను జరపనున్నామని తెలిపారు. కేసులను సరిగా దర్యాప్తు చేయనివారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చింతమనేని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
Chinthamaneni Prabhakar
Cases
Telugudesam

More Telugu News