Varla Ramaiah: వైసీపీ బాధితులకు టీడీపీ శిబిరం నిర్వహించాల్సి రావడం బాధాకరం: వర్ల రామయ్య

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయిందని టీడీపీ అధినాయకత్వం తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు గెంటివేస్తున్నారంటూ చాలామంది స్వగ్రామాలను వదిలి పెట్టి వెళ్లిపోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. వీరికి టీడీపీ గుంటూరులో పునరావాస శిబిరం ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. వైసీపీ ప్రభుత్వ బాధితులకు, సొంత ఊళ్ల నుంచి బహిష్కృతులైన అభాగ్యులకు గుంటూరు టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించాల్సి రావడం బాధాకరమని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై పోలీసు అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వారి గ్రామాలకు బాధితులను పంపించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Varla Ramaiah
Telugudesam
YSRCP
Guntur

More Telugu News